బాలీవుడ్ పై తీవ్ర విమర్శలు చేసిన పాయల్

పలు తెలుగు సినిమాల్లో నటించిన పాయల్ ఘోష్ ఇక్కడి ఆడియెన్స్ కు గుర్తుండే ఉంటుంది. ఆమె ప్రయాణం, మిస్టర్ రాస్కెల్, ఊసరవెల్లి సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్ సరసన నటించిన ఊసరవెళ్లి సినిమా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. బాలీవుడ్ వెళ్లిన పాయల్ ఘోష్ అక్కడ ఒకట్రెండు సినిమాలు మాత్రమే చేయగలిగింది.

బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వివాదంలో చెలరేగినప్పుడు దర్శకుడు అనురాగ్ కశ్యప్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది పాయల్ ఘోష్. తాను అదృష్టవశాత్తూ సౌత్ సినిమాలతో పరిచయం అయ్యానని, ఒకవేళ బాలీవుడ్ మూవీతో అరంగేట్రం చేసి ఉంటే వాళ్లు తన బట్టలు విప్పేసేవారని షాకింగ్ కామెంట్స్ చేసింది.

బాలీవుడ్ వారికి హీరోయిన్స్ గ్లామర్ ప్రదర్శన మీద ఉన్న శ్రద్ధ వారి యాక్టింగ్ టాలెంట్ చూపించడంలో ఉండదంటూ కామెంట్ చేసింది. పాయల్ ఘోష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమెపై మరింత వ్యతిరేకత పెంచుతున్నాయి.