అది “రాజా సాబ్” మూవీ ఫొటో కాదు – హీరోయిన్ నిధి అగర్వాల్

రెబెల్ స్టార్ ప్రభాస్ తో ప్రెస్టీజియస్ మూవీ రాజా సాబ్ లో నటిస్తోంది బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ పై టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్నారు. హారర్ కామెడీ జానర్ లో ప్రభాస్ ఫస్ట్ టైమ్ చేస్తున్న సినిమాగా రాజా సాబ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ ఫొటో అంటూ ఓ స్టిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోపై స్పందించింది నిధి అగర్వాల్.

సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫొటో రాజా సాబ్ సినిమాలోనిది కాదని నిధి అగర్వాల్ ట్వీట్ చేసింది. ఇటీవల ఓ యాడ్ షూట్ లో తీసుకున్న ఫొటో అదని తెలిపింది. రాజా సాబ్ అప్డేట్స్ రెడీ అవుతున్నాయని, అవి అభిమానులను ఎంతో ఖుషి చేస్తాయని నిధి తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. ఇటీవల ఆస్క్ నిధి ఛాట్ లో నిధి స్పందిస్తూ ప్రభాస్ తో కలిసి నటిస్తున్న రాజా సాబ్ సినిమా సెట్ లో ఎంతో సరదాగా పనిచేశామని, ఈ మూవీ టీమ్ లో ఎంతో డెడికేషన్ ఉందని తెలిపింది. రాజా సాబ్ సినిమా నిధి కెరీర్ లో ఓ స్పెషల్ మూవీ కానుంది.