ఎమోషనల్ పోస్ట్ చేసిన నజ్రియా

హీరోయిన్ నజ్రియా నజీమ్ చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను కొంతకాలంగా అందరికీ దూరంగా ఉంటూ వస్తున్నానని, తనకున్న మానసిక సమస్యలే ఇందుకు కారణమంటూ ఆమె తన తాజా ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో తెలిపింది. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్లే ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయడం లేదని ఆమె తన పోస్ట్ లో పేర్కొంది. తన ఆరోగ్యం కోసం ఎంతోమంది మిత్రులు ఫోన్స్ చేస్తున్నారని, అలాగే చిత్ర పరిశ్రమ నుంచి సినిమా ఆఫర్స్ కోసం వచ్చే ఫోన్ కాల్స్ కూడా అటెండ్ చేయలేకపోతున్నాని నజ్రియా తెలిపింది.

ఇప్పుడు తీసుకున్న గ్యాప్ వల్ల అనేక ముఖ్యమైన సందర్భాలను మిస్ అవుతున్నానని ఆమె వెల్లడించింది. ఇటీవల నజ్రియా నటించిన సూక్ష్మదర్శిని సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఓటీటీలో కూడా టాప్ లో ట్రెండ్ అవుతోంది. నజ్రియా తెలుగులో అంటే సుందరానికీ సినిమాలో నటించింది. పలు డబ్బింగ్ మూవీస్ తో ఆమె తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైంది.