హాట్ బ్యూటీగా హీరోయిన్ మాళవిక మోహనన్ కు తమిళ, మలయాళ ఇండస్ట్రీస్ లో మంచి పేరుంది. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాతో టాలీవుడ్ లోనూ అడుగుపెట్టబోతోంది. రొమాంటిక్, హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ప్రభాస్ తో నటించడం వల్ల అనుకుంటా..ఆమె ప్రభాస్ కొత్త సినిమా సలార్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవిక…రీసెంట్ గా క్యూ అండ్ ఏ ఛాట్ చేసింది. ఇందులో నెటిజన్స్ ఆమెను సలార్, డుంకీ ఏ సినిమా మీద మీకు ఇంట్రెస్ట్, దేనికోసం వెయిట్ చేస్తున్నారు అని అడగగా..రెండూ ఇష్టమే కానీ సలార్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నా అంది.
ఈ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇద్దరు కూల్ లుక్స్ లో ఉన్నారంటూ రిప్లై ఇచ్చింది. ప్రభాస్ కొత్త సినిమాతో పాటు విక్రమ్ సరసన తంగలాన్ అనే సినిమాలోనూ మాళవిక హీరోయిన్ గా న నటిస్తోంది.