హీరోయిన్ జ్యోతి పూర్వజ్ కు అరుదైన గౌరవం

హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. “వర్ణపతల” సినిమాకు ప్రతిష్టాత్మక కర్ణాటక స్టేట్ అవార్డ్ దక్కించుకున్నారు. ఈ సినిమాలో ఆటిజంతో బాధపడుతున్న తన కూతురిని సంరక్షించుకునే తల్లి పాత్రలో జ్యోతి పూర్వజ్ నటన ప్రతి ఒక్కరినీ కదిలించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకులు ఈ సినిమాను, సినిమాలో జ్యోతి పూర్వజ్ నటనను ప్రశంసించారు. ఈ చిత్రానికి చేతన్ ముండై దర్శకత్వం వహించారు. వర్ణపతల చిత్రంలో సుహాసినీ మరో కీలక పాత్రలో నటించారు.

ప్రస్తుతం తెలుగులో కిల్లర్ చిత్రంలో నటిస్తోంది జ్యోతి పూర్వజ్. ఈ చిత్రానికి పూర్వాజ్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్నారు. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థింక్ సినిమా బ్యానర్ పై ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. “కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో ఉంది.