“రామాయణ్” షూట్ కు యష్ రెడీ

రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి శ్రీరాముడు, సీతాదేవి పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ భారీ మైథలాజికల్ మూవీ రామాయణ్. ఈ సినిమాను దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్నారు. రామాయణ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ లో ఉంది.

తాజాగా యష్ రామాయణ్ సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు. యష్ ను సెట్ లోకి స్పెషల్ గా ఇన్వైట్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తున్నారట. తన కెరీర్ లో ఇదొక ఛాలెంజింగ్ రోల్ అని యష్ చెబుతున్నారు. రావణుడి పాత్రకు యష్ ఒప్పుకోవడం అందరినీ సర్ ప్రైజ్ చేస్తోంది. మరోవైపు యష్ తన టాక్సిక్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 19న ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది.