వైరల్ గా మారిన వరుణ్ తేజ్ వ్యాఖ్యలు

మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో వరుణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన మాటలు ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ ను ఉద్దేశించి మాట్లాడినవే అని టాక్ మొదలైంది. మట్కా నవంబర్ 14న థియేటర్స్ లోకి వస్తోంది. వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

వరుణ్ తేజ్ మాట్లాడుతూ – ఎప్పుడూ మీ వాళ్ల గురించే మాట్లాడుతావా అంటారు. అవును నేను మా పెదనాన్న, బాబాయ్, తమ్ముడు, మా నాన్న గురించే మాట్లాడుతా. ఈరోజు నువ్వు పెద్ద స్థాయికి వెళ్లి ఉండొచ్చు. కానీ ఎక్కడి నుంచి మొదలుపెట్టావో, ఎవరు నీ వెనక ఉండేవారే, ఎవరు సపోర్ట్ చేశారో మర్చిపోతే ఎలా. అన్నారు.

పవన్ జనసేనకు కాకుండా వైసీపీ ఎమ్మెల్యే క్యాండిటేట్ కు అల్లు అర్జున్ మద్ధతు ఇవ్వడం దగ్గర నుంచి మెగా ఫ్యామిలీలో విబేధాలు మొదలయ్యాయి. ఇప్పుడు వరుణ్ వ్యాఖ్యలు ఆ నేపథ్యంలో చేసినవే అనే మాటలు వినిపిస్తున్నాయి.