బాలీవుడ్ పై రిషభ్ శెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు

బాలీవుడ్ చేస్తున్న సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కన్నడ హీరో, దర్శకుడు రిషభ్ శెట్టి(Rishab shetty). హిందీ సినిమాలు మన దేశ గౌరవాన్ని తగ్గించేలా రూపొందుతున్నాయని ఆయన అన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ ను కించపరిచేలా హిందీ సినిమాలు తెరకెక్కుతున్నాయని రిషభ్ శెట్టి చెప్పారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కాంట్రవర్సీకి తెరలేపుతున్నాయి.

మన దేశం, రాష్ట్రం, ప్రాంతం గర్వపడేలా సినిమాలు తెరకెక్కిస్తానని రిషభ్ శెట్టి తెలిపారు. మన కల్చర్ గురించి ప్రపంచానికి తెలిసేలా గొప్ప సినిమాలు చేయాలని అనుకుంటున్నట్లు ఆయన అన్నారు. రిషభ్ శెట్టి వ్యాఖ్యలపై నెట్టింట కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన గత సినిమాల్లోనే అనేక లోపాలు ఉన్నట్లు పోస్ట్ లు పెడుతున్నారు. కాంతార(kanthara) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు రిషభ్ శెట్టి.