మాస్ ఇమేజ్ కోసం రామ్ తిప్పలు

మాస్ ఇమేజ్ కోసం యాక్షన్ మూవీస్ చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు యంగ్ హీరోస్. రామ్ (Ram pothineni) కూడా ఈ లిస్టులో ఉంటాడు. ఇస్మార్ట్ శంకర్ (Ismart shankar) తో ఫస్ట్ టైమ్ రామ్ కు మాస్ ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత చేసిన స్కంధ, డబుల్ ఇస్మార్ట్ (Double ismart) సినిమాలు సక్సెస్ కాలేకపోయాయి. దీంతో రామ్ కు మాస్ ఇమేజ్ సెట్ కావడం లేదని ప్రూవ్ అవుతోంది.

రామ్ కు గతంలో లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. లవ్ స్టోరీస్, ఎంటర్ టైనర్స్, ఫ్యామిలీ స్టోరీస్ చేసేవాడు. ఇప్పుడవన్నీ పక్కనపెట్టే మాస్ స్టోరీస్ ఎంచుకుంటున్నాడు. దాని ఫలితమే ఈ ఫ్లాప్స్ అనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల పేరున్న హీరోలు కూడా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ మీద దృష్టి పెడుతున్నారు. రామ్ కూడా అలాగే మూవీస్ చేస్తే మంచిది.