మరో గ్లోబల్ అవార్డ్ నామినేషన్ లో రామ్ చరణ్

ఆర్ఆర్ఆర్ తో ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్ చరణ్ ..ఆ సినిమా సందర్భంగా ఆస్కార్ విన్నింగ్ టీమ్ లో భాగమవడంతో సహా పలు అంతర్జాతీయ అవార్డ్స్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయా దేశాల్లో ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. తాజాగా రామ్ చరణ్ మరో గ్లోబల్ అవార్డ్ కు నామినేట్ అయ్యారు. అమెరికాలో జరిగే పాప్ గోల్డెన్ అవార్డ్స్ కు టాలీవుడ్ నుంచి నామినేట్ అయిన ఒకే ఒక స్టార్ గా రామ్ చరణ్ నిలిచారు. ఈ లిస్టులో బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, దీపకా, అర్జున్ మథుర్ వంటి వారున్నారు. తెలుగు హీరోయిన్ రాశీ ఖన్నాకు కూడా లిస్టులో చోటు దక్కింది.

సినిమాలు, సంగీతం, టెలివిజన్ వంటి రంగాల్లో ఈ పాప్ గోల్డెన్ అవార్డ్స్ అందిస్తారు. అమెరికాలోని లాస్ ఏంజెలీస్ లో నవంబర్ లో ఈ అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఈ అవార్డ్ దక్కితే రామ్ చరణ్ ఖాతాలో మరో ఇంటర్నేషనల్ పురస్కారం దక్కినట్లే. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలు రామ్ చరణ్ అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.