మెగా హీరో రామ్ చరణ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఇది భారీ పాన్ ఇండియా చిత్రంగా ఉండనుందట. స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ బయోపిక్ తెరకెక్కించేందుకు బాలీవుడ్ లో సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోగా రామ్ చరణ్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. కొహ్లీ బయోపిక్ కు రామ్ చరణ్ బాగుంటాడని మేకర్స్ భావిస్తున్నారట.
టీమిండియా కెప్టెన్ గా, స్టార్ బ్యాట్స్ మెన్ గా కొహ్లీకున్న క్రేజ్ తెలిసిందే. ఈ స్టార్ క్రికెటర్ లైఫ్ ఆధారంగా సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. క్రికెట్ లవర్ గా కొహ్లీని అభిమానిస్తాడు రామ్ చరణ్. తన ఫేవరేట్ క్రికెటర్ బయోపిక్ లో నటించే అవకాశం వచ్చింది కాబట్టి రామ్ చరణ్ హ్యాపీగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ రావొచ్చు.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. చరణ్ కు బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా ఉంది. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ సినిమా వచ్చే జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.