కొందరు హీరోలు డైరెక్టర్స్ గా మారడం, డైరెక్టర్స్ హీరోలుగా పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం. అలాంటి వర్సటాలిటీ చూపిస్తున్నారు యంగ్ డైరెక్టర్ పూర్వాజ్. “శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షించిన పూర్వాజ్..ఇప్పుడు “కిల్లర్” అనే మూవీని రూపొందిస్తూ ఆ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.
ఈ డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నుంచి ఆయన ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు. “కిల్లర్” మూవీలో పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ చూస్తే..చేతిలో రివాల్వర్ తో డీప్ థింకింగ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై “కిల్లర్” చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది.