“రాబిన్ హుడ్” పోస్ట్ పోన్ – అప్ సెట్ అవుతున్న నితిన్

నితిన్ ఒకప్పుడు వరుసగా సక్సెస్ చూశాడు.. ఆతర్వాత వరుసగా ఫ్లాప్స్ కూడా చూశాడు. ఈమధ్య కాలంలో.. నితిన్ కెరీర్ పడుతూ లేస్తూ వెళుతోంది. నితిన్ లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ ని క్రిస్మస్ కు రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. దీంతో..నితిన్ టెన్షన్ లో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది.

రాబిన్ హుడ్ మూవీకి వెంకీ కుడుముల డైరెక్టర్. భీష్మ కాంబోలో రూపొందుతోన్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే.. ఈ సినిమాను క్రిస్మస్ కు రిలీజ్ చేయకపోడంతో నితిన్ బాగా అప్ సెట్ అయ్యాడని.. ఈ కారణంగానే హీరో నితిన్, నిర్మాత మైత్రీ మూవీ మేకర్స్ మధ్య విభేదాలు వచ్చాయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబిన్ హుడ్ రిలీజ్ అయితే.. తమ్ముడు రిలీజ్ ఎప్పుడు అనేది ప్లాన్ చేయాలి. రెండు సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉండి కూడా రిలీజ్ డేట్స్ ఫిక్స్ కాకపోవడంతో టెన్షన్ పడుతున్నాడట.