దసరా సూపర్ హిట్ తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చారు హీరో నాని. ఈ సినిమా పాన్ ఇండియా వసూళ్లు సాధించకున్నా తెలుగులో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకు ముందు నాని వరుసగా ఫ్లాప్స్ చూశాడు. దసరా హిట్ ఆయనలో మళ్లీ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ స్టార్ తన 30వ సినిమా హాయ్ నాన్నలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కొత్త దర్శకుడు శౌర్యువ్ రూపొందిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న నాని తన కొత్త సినిమాకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తమిళ హీరో శివ కార్తికేయన్ తో డాన్ సినిమాను రూపొందించి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు సిబి చక్రవర్తితో నాని సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. నాని తన కెరీర్ స్టార్టింగ్ లో పలు తమిళ, తెలుగు ద్విభాషా చిత్రాల్లో నటించారు. అలాగే ఆయన ఈగ సినిమా కోలీవుడ్ లో మంచి హిట్ అయ్యింది.
ఇలా నాని తమిళ ప్రేక్షకులకు బాగా తెలుసు. అందుకే అక్కడి దర్శకులు మరే హీరోను అప్రోచ్ కానంతగా నానికి కథలు చెబుతుంటారు. ఈ క్రమంలో సిబి చక్రవర్తి చెప్పిన కథ నానికి ఓకే చేశారని తెలుస్తోంది. హాయ్ నాన్న తర్వాత ఇదే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాాచారం.