పబ్లిక్ లైఫ్ లో ఉండే సెలబ్రిటీలు అభిమానంతో పాటు విమర్శలను, రూమర్స్ నూ ఎదుర్కొవాల్సిఉంటుంది. సినిమాలకు ప్రచారం చేసే మాధ్యమాలే కొన్నిసార్లు ఏవో సోర్స్ ల ద్వారా న్యూస్ పోస్టింగ్ లు చేస్తుంటాయి. ఆ మాత్రం దానికి తీవ్రమైన భాషతో స్పందించడం సరికాదు. నాని ప్యారడైజ్ మూవీ టీమ్ ఇలాంటి వ్యాఖ్యలతోనే సోషల్ మీడియా పోస్ట్ చేసింది. తమ సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం చేసేవారిని జోకర్స్ అని, మొరిగే కుక్కలు అని పేర్కొనడంపై విమర్శలు మొదలయ్యాయి.
సోషల్ మీడియా వాళ్లు తమపై బతుకుతున్నారనే మాటలు వాడటం కూడా వివాదాస్పదమవుతోంది. సినిమా ఇండస్ట్రీ ఒక సర్కిల్. ఇక్కడ స్టార్స్ కు మీడియా, మీడియాకు స్టార్స్ కావాలి. ఒకరి మీద మరొకరు బతకడం అనేదేమీ ఉండదు. ఇదే సోషల్ మీడియా వెబ్ సైట్స్ నాని సినిమాలకు ప్రచారం చేయకుండానే ప్రేక్షకులకు కంటెంట్ రీచ్ అయ్యిందా. నాని ప్రమేయం లేకుండా ప్యారడైజ్ మూవీ టీమ్ ఇలాంటి సోషల్ మీడియా పోస్ట్ చేస్తుందని అనుకోలేం.