“హిట్ 3” సెట్ లో నాని

హీరో నాని(Nani) తన కొత్త సినిమా హిట్ 3(HIT 3) షూటింగ్ స్టార్ట్ చేశారు. సరిపోదా శనివారం సినిమా రిలీజ్, ప్రమోషన్ హడావుడి నుంచి బయటకు వచ్చిన నాని తన కొత్త మూవీ సెట్ లో ఈరోజు నుంచి జాయిన్ అయ్యారు. నాని ప్రొడ్యూస్ చేసిన హిట్ సిరీస్ లో వస్తున్న మూడో చిత్రమిది. శైలేష్ కొలను(Sailesh kolanu) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ లో ప్రశాంతి తిపిర్నేని పార్టనర్ అవుతున్నారు.

హిట్ 3 సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైయింది. నాని మొదటి రోజే సెట్ లో అడుగుపెట్టారు. ఈ చిత్రంలో అర్జున్ సర్కార్‌ అనే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నాని కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది మే 1న హిట్ 3 థియేటర్స్ లోకి రానుంది.