నాగచైతన్య, శోభితాల ఎంగేజ్ మెంట్ ఆగష్టులో జరిగిన విషయం తెలిసిందే. ఆతర్వాత మ్యారేజ్ ఎప్పుడు అనేది మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు డేట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం. ఎప్పుడంటే.. డిసెంబర్ 4న అని తెలిసింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ మ్యారేజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకీ.. ఎక్కడ పెళ్లి చేయనున్నారంటే.. రాజస్థాన్ అని ప్రచారం జరిగింది కానీ.. ఇప్పుడు హైదరాబాద్లోనే చేయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం.
ఎన్ కన్వెషన్ ఉంటే.. అక్కడే చేసేవారు కానీ.. ఇప్పుడు అది లేదు. మరి.. ఎక్కడ చేస్తారంటే.. అన్నపూర్ణ స్టూడియోలోనే ఈ పెళ్లిని గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాగచైతన్య ఆల్రెడీ తన స్నేహితులకు పెళ్లి శుభలేక అందచేస్తున్నాడని తెలిసింది. మరో వైపు తండేల్ షూటింగ్ కూడా జరుగుతోంది. ఓ పది రోజులు షూటింగ్ చేస్తే తండేల్ షూటింగ్ పూర్తవుతుంది.