ఈ దీపావళి ఎంతో ప్రత్యేకం – హీరో కిరణ్ అబ్బవరం

క సినిమా విజయంతో ఈ దీపావళి తనకు ఎంతో స్పెషల్ గా మారిందని అన్నారు హీరో కిరణ్ అబ్బవరం. చాలా రోజుల తర్వాత హ్యాపీగా నిద్రపోతున్నానని, క సినిమాకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు కిరణ్ అబ్బవరం. క సినిమా సక్సెస్ పై ట్వీట్ చేశారాయన. ఈ ట్వీట్ లో క సినిమాకు వస్తున్న ఆదరణపై స్పందించారు.

మీ అందరికీ హ్యాపీ దీపావళి. క సినిమాకు వస్తున్న రెస్పాన్స్, మీడియా రివ్యూస్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. అందరి హీరోల ఫ్యాన్స్ సినిమా బాగుందంటూ సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు. క్లైమాక్స్ చాలా బాగుందంటూ నాకు ఫోన్స్, మెసేజ్ లు వస్తున్నాయి. మీ లవ్ అండ్ సపోర్ట్ కు థ్యాంక్స్. అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.