చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులు మనల్ని ప్రేమించడం సహజం కానీ ఎవరో తెలియని, ఏ బంధం లేని అభిమానులు, ప్రేక్షకుల ప్రేమ పొందడం సినీతారల అదృష్టం. అలాంటి అదృష్టం పొందారు హీరో కిరణ్ అబ్బవరం. ఆయన లేటెస్ట్ మూవీ క చూసిన వారంతా కిరణ్ అబ్బవరంకు విజయం రావడం తమ విజయంగా భావిస్తున్నారు.ఈ ప్రేమ ఆదరణకు కదిలిపోయారు కిరణ్ అబ్బవరం. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.
‘ఎవరికైనా హిట్ వస్తే హిట్ కొట్టాడు అంటారు కానీ నాకు హిట్ వస్తే హిట్ కొట్టేశాము అంటున్నారు. “క” సినిమా సక్సెస్ కంటే మీరు నాపై చూపిస్తున్న ఈ ప్రేమ మరింత సంతోషాన్ని ఇస్తోంది. ఇంతమంది ప్రేమ పొందిన నేను అదృష్టవంతుడిని. మీ అందరికీ కృతజ్ఞతలు..’ అంటూ కిరణ్ అబ్బవరం తన సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు.