హీరో కిరణ్ అబ్బవరం “క” టీజర్ రివ్యూ – ఇంటెన్స్, ఎలక్ట్రిఫైయింగ్

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran abbavaram) నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క” (KA teaser) టీజర్ రిలీజైంది. ఈ టీజర్ ఇంటెన్స్ అండ్ ఎలక్ట్రిఫైయింగ్ గా ఉండి ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో పోస్ట్ మేన్ క్యారెక్టర్ లో న్యూ అట్రాక్టివ్ లుక్ తో కనిపించారు కిరణ్ అబ్బవరం. పీరియాడిక్ మూవీ కాబట్టి అప్పటి మేకోవర్, హెయిర్ స్టైల్ కిరణ్ అబ్బవరంకు యాప్ట్ గా సెట్ అయ్యింది. యాక్షన్, డివోషనల్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో “క” మూవీ తెరకెక్కినట్లు టీజర్ తో తెలుస్తోంది.

నాకు తెలిసిన నేను మంచి, నాకు తెలియని నేను..అంటూ డైలాగ్ ఆపేయడం ఆసక్తి రేపుతోంది. అందమైన అటవీ ప్రాంతంలోని కృష్ణగిరి అనే ఊరు నేపథ్యంలో “క” సినిమా సాగనుంది. నువ్వు తోడేలువురా అంటూ ఓ వ్యక్తి చెప్పడం హీరో క్యారెక్టర్ పై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. పోస్ట్ మేన్ గా ఉత్తరాలు ఎ‌వరివి వారికి అందించాల్సిన కిరణ్ అబ్బవరం…వారి ఉత్తరాలు చింపి ఎందుకు చదువుతున్నాడు అనేది సినిమాలో చూడాలి. హై ప్రొడక్షన్, టెక్నికల్ వ్యాల్యూస్ టీజర్ లో కనిపించాయి.

“క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్(Srichakraas entertainment) తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ (Sujeeth and sandeep) రూపొందిస్తున్నారు. “క” సినిమా త్వరలో “క” సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.