బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ దర్శకుడిగా మారుతున్నారు. ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ సిరీస్ గా నిలిచిన క్రిష్ సిరీస్ లో నాలుగో చిత్రం క్రిష్ 4కు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ విషయాన్ని హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. క్రిష్ 4 సినిమా చాలాకాలంగా బడ్జెట్ ఇబ్బందులతో తెరకెక్కడం లేదు.
ఈ సినిమాకు అయ్యే బడ్జెట్ కు హృతిక్ రోషన్ బాక్సాఫీస్ రేంజ్ కు చాలా వ్యత్యాసం ఉండటంతో ఫైనాన్షియర్స్ పెట్టుబడికి ముందుకు రావడం లేదు. ఇప్పుడు హృతిక్ దర్శకత్వం అంటే కొత్త క్రేజ్ ఒకటి యాడ్ అవుతుంది కాబట్టి ఇలా అనౌన్స్ చేశారని తెలుస్తోంది. హృతిక్ దర్శకుడిగా విజయవంతం కావాలని విష్ చేశారు దర్శకుడు రాకేష్ రోషన్.