“ధూం ధాం” సినిమా టీజర్ డైలాగ్ తమ సినిమా కంటెంట్ ను తెలియజేస్తుందని అన్నారు హీరో చేతన్ కృష్ణ. ఈ రోజు జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో ఆయన ఈ డైలాగ్ చెబుతూ ఫ్యూర్ ఎంటర్ టైన్ మెంట్ కోసం ఈ నెల 8న “ధూం ధాం” థియేటర్స్ కు రావాలంటూ ఆడియెన్స్ ను రిక్వెస్ట్ చేశారు. ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో
హీరో చేతన్ కృష్ణ మాట్లాడుతూ – “ధూం ధాం” సినిమా ఫస్టాఫ్ పాటలు, లవ్ స్టోరీతో సరదాగా వెళ్తుంది. సెకండాఫ్ కు వచ్చేప్పటికి గంట సేపు పెళ్లి ఇంట్లో హిలేరియస్ కామెడీ ఉంటుంది. ఈ మూవీకి హీరోగా నా బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నించా. మేము టీజర్ లో చూపించినట్లు “ధూం ధాం” సినిమాలో కష్టాలు, కన్నీళ్లు ఉండవు. ప్యూర్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. మీ సపోర్ట్ మా టీమ్ అందరికీ దక్కుతుందని ఆశిస్తున్నా. ఈ నెల 8న థియేటర్స్ లో మా “ధూం ధాం” చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.