మంచి యాక్షన్ మూవీ చేయాలని ఉంది – ఆనంద్ దేవరకొండ

ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా గం గం గణేశా ఎల్లుండి గ్రాండి థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. క్రైమ్ కామెడీ మూవీగా ఈ సినిమా ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆనంద్ ను పూర్తిగా కొత్తగా చూపించబోయే చిత్రమిది. బేబి తర్వాత యూత్ ఆడియెన్స్ లో ఆనంద్ కు ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఆ ప్రభావం గం గం గణేశా ఓపెనింగ్స్ మీద చూపించనుంది. క్రైమ్ కామెడీస్ ఇష్టపడతానంటున్న ఆనంద్ దేవరకొండ గం గం గణేశా ఎలా ఉండబోతుందో, తన ఫేవరేట్ జానర్ మూవీ ఏంటో ఇవాల్టి ఇంటర్వ్యూలో చెప్పారు.

హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – వినాయకుడి విగ్రహం చుట్టూ జరిగే కథ ఇది. ఆ విగ్రహం దక్కించుకోవడం కోసం కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్లంతా బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నవాళ్లు. ఆ విగ్రహంలో అంత విలువైనది ఏముంది. ఎవరికి విగ్రహం దక్కింది అనేది కథాంశం. మనలోనూ భయం, అత్యాశ, కుట్ర అనే లక్షణాలు ఉంటాయి. అవి కొందరి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి
అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం. అన్ని వర్గాల ఆడియెన్స్ కు నచ్చే సినిమా ఇది. ధనుష్ కర్ణన్, అసురన్ లా రా అండ్ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ చేయాలని ఉంది. అన్నారు.