“తల్వార్” టైటిల్ తో వస్తున్న యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్

యంగ్ టాలెంటెడ్ హీరో ఆకాష్ జగన్నాథ్ (Akash Jagannath) పేరు మార్చుకోవడమే కాదు తన లైనప్ కూడా మార్చేశాడు. ఈసారి భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తల్వార్ (Thalvar) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రోజు తల్వార్ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను వార్నిక్ స్టూడియోస్ బ్యానర్ పై భాస్కర్ ఇ.ఎల్.వి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు కాశీ పరశురామ్ (Kasi parashuram) రూపొందిస్తున్నారు.

తల్వార్ సినిమా ప్రారంభోత్సవంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు అతిథిలుగా పాల్గొన్నారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. హీరో కార్తికేయ స్క్రిప్ట్ అందించగా.. డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఫస్ట్ షాట్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బిగ్ కాస్టింగ్ ఉండబోతోంది. త్వరలో తల్వార్ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.