ఏజెంట్ తర్వాత ఇంత వరకు అఖిల్ నుంచి కొత్త సినిమా రాలేదు. అఫిషియల్ గా ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. ఈసారి భారీ సోషియో ఫాంటసీ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అనిల్ అనే కొత్త దర్శకుడుతో సినిమాను చేయడానికి ఓకే చెప్పాడు. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ నిర్మించాలి అనుకుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసింది. అయితే.. ఈ నిర్మాణ సంస్థ మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర మూవీ చేస్తుంది. ఆ సినిమా నిర్మాణంలో భారీ బడ్జెట్ పెట్టడం వలన అది కంప్లీట్ అయిన తర్వాత అఖిల్ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు.
ఈ లోపు మురళీకృష్ణ అబ్బూరు డైరెక్షన్ లో అఖిల్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ మూవీకి లెనిన్ అనే టైటిల్ ఖరారు చేశారని తెలిసింది. అఖిల్ కు జంటగా శ్రీలీల నటిస్తోంది.