“ది రాజా సాబ్” షూటింగ్ అప్డేట్ ఇదే

రెబెల్ స్టార్(Rebalstar) ప్రభాస్(Prabhas) నటిస్తున్న ది రాజా సాబ్(The raaja saab) సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ లో తన పార్ట్ ను ప్రభాస్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కు సంబంధించిన పోర్షన్స్ కంప్లీట్ చేసి ఇతర నటీనటులతో సీన్స్ తెరకెక్కిస్తున్నారట. ప్రభాస్ పలు భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నందున ఆయన షూటింగ్ వరకు త్వరగా కంప్లీట్ చేస్తున్నారు దర్శకుడు మారుతి(Maruthi).

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ది రాజా సాబ్ సినిమా ప్రభాస్ కెరీర్ లో ఓ స్పెషల్ మూవీ కాబోతోంది. హారర్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతుండటమే ఈ స్పెషాలిటీకి కారణం. ప్రభాస్ ఇప్పటిదాకా ఇలాంటి జానర్ లో నటించలేదు. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ది రాజా సాబ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.