కొత్త ఫ్రెండ్ తో రామ్ చరణ్

పెట్ లవర్స్ కు మనుషులతో పాటు జంతువులు కూడా ఫ్రెండ్సే. ఇలా స్టార్ హీరో రామ్ చరణ్ కు మరో కొత్త ఫ్రెండ్ పరిచయమైంది. ఇదొక హార్స్. పేరు బ్లేజ్. హార్స్ రైడింగ్ అంటే ఇష్టపడే రామ్ చరణ్…కొత్త హార్స్ లను తెప్పించుకుంటారు. ఇప్పుడు బ్లేజ్ కూడా ఆయన స్టాబిల్ (గుర్రాలను కట్టేసే ప్లేస్)లో చేరిపోయింది. బ్లేజ్ తో రామ్ చరణ్ తీయించుకున్న కొత్త స్టిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

చరణ్ ఫాదర్ చిరంజీవికి కూడా గుర్రాలంటే ఇష్టం. హార్స్ రైడింగ్ చేయడం ఇష్టపడుతుంటారు. అలా చరణ్ కు కూడా చిన్నప్పటి నుంచే హార్స్ రైడింగ్ మీద, గుర్రాలతో స్నేహం మీద ఆసక్తి ఏర్పడింది. హార్స్ రైడింగ్ హెల్దీ హాబిట్. హార్స్ రైడింగ్ తెలియడం హీరోగా రామ్ చరణ్ కు సినిమాల్లోనూ ఒక అడ్వాంటేజ్ అయ్యింది. మగధీరలో రామ్ చరణ్ గుర్రంతో చేసిన విన్యాసాలు ఆ సినిమాకు ఆకర్షణ అయ్యాయి.

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఆయనకు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సిఉంది. ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.