మూవీ ఆర్టిస్ట్ అసోసియషన్ కు హేమ ఓపెన్ లెటర్

బెంగళూరు రేవ్ పార్టీ (Rave party)లో పాల్గొని జైలుకు వెళ్లింది నటి హేమ (Actress Hema). ఆమె డ్రగ్స్ (Drugs) తీసుకుందని ప్రూవ్ కావడంతో ఆమెను రిమాండ్ చేశారు. జైలుకు వెళ్లడంతో హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) సస్పెన్షన్ వేసింది. బెయిల్ మీద బయటకు వచ్చిన హేమ ఇప్పుడీ సస్పెన్షన్ ను తొలగించాలంటూ ఓపెన్ లెటర్ రాసింది. ఈ లేఖను పట్టుకుని మంచు విష్ణు (Manchu vishnu)ను కలిసింది.

తాను బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకోలేదని, అది తాను చేయించుకున్న ల్యాబ్ లో టెస్ట్ ల్లోనూ తేలిందని హేమ లేఖలో పేర్కొంది. ఇదే రిజల్ట్ రేపు పోలీసులు నిర్వహించే డ్రగ్ టెస్టుల్లోనూ వస్తుందని హేమ తెలిపింది. ఇలాంటి కష్టకాలంలో తనకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సపోర్ట్ గా ఉండాలని, తన సస్పెన్షన్ తొలగించాలని హేమ కోరింది.