సూర్య తెలుగు స్ట్రైయిట్ మూవీ డైరెక్టర్ ఇతనే

తెలుగులో స్ట్రైయిట్ మూవీ చేయాలని సూర్య ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ.. కుదరడం లేదు. సూర్యతో సినిమా చేయాలని రాజమౌళి గతంలో అనుకున్నా కుదరలేదు. రాజమౌళి మాత్రమే కాదు.. పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను.. ఇలా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ట్రై చేశారు కానీ.. ఎందుకనో ఇప్పటి వరకు సెట్ కాలేదు. ఇప్పుడు సూర్య తెలుగు స్రైయిట్ మూవీ సెట్ అయ్యిందని తెలిసింది. సూర్య స్ట్రైట్ తెలుగు మూవీ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో ఉంటుందని సమాచారం.

వెంకీ అట్లూరి కోలీవుడ్ హీరో ధనుష్ తో సార్ అనే సినిమా చేశాడు. ప్రేక్షకులను మెప్పించాడు. ఆతర్వాత దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ అనే మూవీ చేశాడు. ఈ సినిమాతో కూడా విజయం సాధించాడు. అయితే.. తమిళ హీరో, మలయాళ హీరోలతో సక్సెస్ సాధించిన వెంకీ అట్లూరి ఈసారి తెలుగు హీరోతో మూవీ చేస్తాడనుకుంటే.. సూర్యతో సినిమా చేస్తున్నాడని తెలిసింది. సూర్యను మెప్పించిన ఆ కథ ఏంటి అంటే.. మారుతి కారు ఇండియాకు ఎలా వచ్చింది..? దాని నేపథ్యం ఏంటి..? అనే బ్యాక్ డ్రాప్ లో కథ రాసుకున్నాడట. ఈ కథ సూర్యకు చెప్పిన వెంటనే నచ్చిందట. మరి.. ధనుష్, దుల్కర్ సల్మాన్ కు సక్సెస్ అందించిన వెంకీ అట్లూరి సూర్యకు కూడా విజయాన్ని అందిస్తాడేమో చూడాలి.