మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం.. పెద్దల సమక్షంలో ఎంగేజ్ మెంట్ జరగడం తెలిసిందే. ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో నిశ్చితార్థం గత నెల 9న జరిగింది. నాగబాబు ఇంట్లో జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అప్పుడు మ్యారేజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు. ఈ ఇయర్ లోనే ఉంటుందని వార్తలు వచ్చాయి. దీంతో వరుణ్, లావణ్యల పెళ్లి ఎప్పుడు..? అనేది ఆసక్తిగా మారింది.
తాజా వార్త ఏంటంటే.. వీరి పెళ్లికి ముహూర్తం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎప్పుడంటే.. ఆగస్టు 24వ తేదీన పెద్దల సమక్షంలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటికాబోతున్నట్టు తెలుస్తోంది. మరి.. పెళ్లి వేడుక ఎక్కడ అంటే.. ఇటలీలో ఘనంగా జరగనుందని సమాచారం. షాపింగ్, ఇతర పనుల కోసం వరుణ్, లావణ్య ఇప్పటికే విదేశాలకు వెళ్లినట్టు చెబుతున్నారు. మిస్టర్ సినిమాలో వీరిద్దరూ తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమా టైమ్ లోనే వీరిద్ధరూ ప్రేమలో పడ్డారు. ఆగష్టు 24న పెళ్లి అయితే.. ఆతర్వాత రోజు ఆగష్టు 25నే వరుణ్ తేజ్ నటించిన గాంఢీవధారి అర్జున చిత్రం విడుదల కాబోతుండడం విశేషం.