నితిన్ మూవీ టైటిల్ మారిందా..?

యంగ్ హీరో నితిన్ ఈమధ్య కెరీర్ లో కాస్త వెనకబడ్డాడు. సరైన సక్సెస్ సాధించాలని పట్టుదలతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి రైటర్ టర్నడ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో వక్కంతం వంశీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా చేశాడు. దర్శకుడుగా తొలి ప్రయత్నం ఫలించలేదు. అయినప్పటికీ నితిన్ అవకాశం ఇచ్చాడు. కథారచయితగా సక్సెస్ అయిన వంశీ డైరెక్టర్ గా మాత్రం విజయం సాధించలేదు. ఇప్పుడు మలి ప్రయత్నంలో విజయం సాధించాలని కసితో వర్క్ చేస్తున్నాడు.

అయితే.. నిఖితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ షూటింగు జరుపుకుంది. ఈ సినిమాలో నితిన్ జోడీగా శ్రీలీల కనిపించనుంది. ఈ సినిమాకి జూనియర్ అనే టైటిల్ ను అనుకున్నారు. అయితే ఆ టైటిల్ అంత ఎఫెక్టివ్ గా అనిపించడం లేదని చెప్పి పక్కన పెట్టేశారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి ఎగస్ట్రా అనే టైటిల్ ను సెట్ చేశారట. ట్యాగ్ లైన్ గా ఆర్డినరీ మేన్ అనేది ఉంటుంది. అంటే మొత్తంగా చూసుకుంటే ఎక్స్ ట్రార్డినరీ మేన్ గా అనిపిస్తుందన్న మాట. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి టైటిల్ కూడా డిఫరెంట్ గానే ఉండేలా ఇలా ప్లాన్ చేశారట