సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లడానికి ముహూర్తం పిక్స్ అయ్యిందట. ఇంతకీ ఎప్పుడంటే.. ఈ నెల 12న అని తెలిసింది. హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభించనున్నారు. అయితే.. ఈ సినిమాకి సంబంధించిన కొంత టాకీ పార్ట్ అమెరికాలో తీయాలి. అందుకనే పరశురామ్ ప్రస్తుతం అమెరికాలో లోకేషన్స్ వేటలో ఉన్నాడట.
మరో రెండు రోజుల్లో హైదరాబాద్ వస్తాడు. ఇక్కడకు వచ్చిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇందులో విజయ్ కు జంటగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఇందులో మరో కథానాయిక కూడా ఉంది. ఆమె కోసం చిత్రయూనిట్ అన్వేషిస్తోంది. మరో వైపు విజయ్ చేస్తున్న ఖుషి సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ వారంలోనే షూటింగ్ పూర్తవుతుంది. అందుకనే పరశురామ్ తో చేయనున్న సినిమాకి డేట్స్ ఇచ్చాడు. ఈ చిత్రానికి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మరి.. ఈ సినిమాతో గీత గోవిందం రేంజ్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.