హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం స్పై. ఈ చిత్రానికి ఎడిటర్ గ్యారీ డైరెక్టర్. సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీ నేపధ్యంలో రూపొందిన చిత్రమిది. టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ సినిమా పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఈ నెల 29న స్పై చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ సినిమాని బాగా ఇండియా వైడ్ బాగా ప్రమోట్ చేయాలని.. అందుకోసం ఎక్కువ టైమ్ కావాలి కాబట్టి మూవీ రిలీజ్ ని వాయిదా వేద్దామని హీరో నిఖిల్, నిర్మాత రాజశేఖర్ రెడ్డితో చెబితే నో చెప్పాడట.
అప్పటి నుంచి హీరో నిఖిల్, నిర్మాత రాజశేఖర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. దీంతో రిలీజ్ అనేది సస్పెన్స్ లో పడింది. అయితే.. ఈ రోజు క్లారిటీ వచ్చేసింది. స్పై మూవీ ముందుగా ప్రకటించినట్టుగానే 29న వస్తుందని ప్రకటించారు. కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే.. నిఖిల్ తన సైడ్ నుంచి డబ్బింగ్ వర్క్ కంప్లీట్ చేశాడట కానీ.. అతనికి ఇది నచ్చడం లేదట. అందుకనే కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. మరి.. ప్రమోషన్స్ కు అయినా వస్తాడో రాడో.. ఒకవేళ ప్రమోషన్స్ ఇంటర్ వ్యూలో ఎలా స్పందిస్తాడో అనేది ఆసక్తిగా మారింది.