ప్రభాస్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సలార్ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానుంది. కల్కి సంక్రాంతికి లేదా సమ్మర్ కి విడుదల కానుంది. ఆతర్వాత మారుతితో చేస్తున్న సినిమా రిలీజ్ కానుంది. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు మరో సినిమాకి ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఎవరితో అంటే.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ అని టాక్ వినిపిస్తోంది. సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు.

అయితే.. ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో అనుకుంట ప్రభాస్ కు ఓ కథ చెప్పాలన్నారట. ఓకే చెప్పమంటే.. ఓ గ్యాంగ్ స్టర్ స్టోరీ చెప్పారని తెలిసింది. అయితే.. కథ బాగున్నా కూడా ప్రభాస్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదంట. పృథ్వీ రాజ్ ప్రస్తుతం మలయాళంలో ఒక పాన్ ఇండియా మూవీ చేసే ప్రయత్య్నంలో ఉన్నారు. దాని తర్వాత ప్రభాస్ తో సినిమా చేయాలని అనుకుంటున్నారట. అయితే.. ప్రభాస్ ఈ మూవీ చేయాలి అనుకున్నప్పటికీ.. మారుతితో సినిమా, సలార్ 2, కల్కి 2, స్పిరిట్ సినిమాలు ఉన్నాయి. అందుచేత పృథ్వీరాజ్ సుకుమారన్ తో ప్రభాస్ ఓకే అయినా సెట్స్ పైకి రావడానికి చాలా టైమ్ పట్టచ్చు.