మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. ఈ ఓటీటీలో డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ “హరికథ” ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ట్రైలర్ తో ఇప్పటికే కావాల్సినంత బజ్ క్రియేట్ చేసిందీ సిరీస్. దీంతో ఎక్కువ సంఖ్యలో ఆడియెన్స్ “హరికథ” వెబ్ సిరీస్ పై ఆసక్తి చూపిస్తున్నారు.
“హరికథ” వెబ్ సిరీస్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. మ్యాగీ “హరికథ” సిరీస్ కు దర్శకత్వం వహించారు. దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మైథాలజీ టచ్ తో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “హరికథ” వెబ్ సిరీస్ తెలుగులో సరికొత్త స్టాండర్డ్ క్రియేట్ చేసే బెంచ్ మార్క్ వెబ్ సిరీస్ గా పేరు తెచ్చుకుంటోంది.