పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త మూవీ హరి హర వీరమల్లు. ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. క్రిష్ ఈ మూవీకి డైరెక్టర్ అయితే..ఎంతకీ ఈ సినిమా కంప్లీట్ కాకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. మిగిలిన షూటింగ్ ను జ్యోతికృష్ణ పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్ నటిస్తోంది. మే 9 ఈ సినిమా రిలీజ్ కావాల్సిఉంది. ఇప్పుడు వీరమల్లు మళ్లీ వాయిదా అంటూ ప్రచారం జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా తను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాలి అనుకుంటున్నారు కానీ.. కుదరడం లేదు. వీరమల్లులో ఇంకా పవన్ కళ్యాణ్ పై చిత్రీకరించాల్సిన సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయట. వీటిని ఏప్రిల్ నెలలో షూట్ చేయాలి అనుకుంటున్నారు. ఏప్రిల్ లో ఎలాంటి అడ్డంకులు లేకుండా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడం.. షూటింగ్ చేయడం జరిగితే.. మే 9న వీరమల్లు రావచ్చు. ఒకవేళ అలా జరగకపోతే వీరమల్లు మళ్లీ వాయిదా పడచ్చు. మేకర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వీరమల్లు వాయిదాపడదు.. మే 9న రావడం పక్కా అంటున్నారు.