“ఉస్తాద్ భగత్ సింగ్”లో మార్పులు చేర్పులు..?

హరీష్ శంకర్(Hareesh shankar) మంచి మాటకారి. తన దగ్గర అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. తను ఆన్సర్ ఇచ్చిన తర్వాత మాట్లాడడానికి ఏమి ఉండదు. అంతలా క్లారిటీ ఇస్తాడు. అయితే.. ఈ తెలివితేటలు స్క్రిప్ట్ లో పెడితే తన నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయి అనే కామెంట్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇటీవల హరీష్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్(Mr bachan) మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే.. డిజాస్టర్ గా నిలిచింది. తన వలన నిర్మాతకు వచ్చిన నష్టానికి రెండు కోట్లు వెనక్కి ఇచ్చేశారని తెలిసింది.

హరీష్ శంకర్ స్క్రిప్ట్ విషయంలో ఎవరి మాట వినడని.. అంతా నా ఇష్టం అనేలా తను అనుకున్నదే చేస్తాడని ఇండస్ట్రీలో అంటుంటారు. అయితే.. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అవ్వడంతో అతనిలో మార్పు వచ్చిందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) తో చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad bhagatsingh) విషయంలో ఆలోచనలో పడ్డాడట. కథ పై మళ్లీ కసరత్తు చేస్తున్నాడట. తన రైటర్స్ తో చర్చలు జరుపుతున్నాడట. కథలో మార్పులు చేర్పులు చేయాలని డిసైడ్ అయ్యాడటని తెలిసింది. త్వరలో పవన్ వీరమల్లు(Hari Hara veeramallu), ఓజీ(OG) షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఆతర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో జాయిన్ అవుతారు. ఈలోపు కథలో మార్పులు చేస్తున్నాడట హరీష్ శంకర్. మార్పు మంచిదే.. మరి.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.