మ్యూజిక్ కు స్కోప్ ఉన్న మంచి చిత్రాలు చేస్తూ సంగీత దర్శకుడిగా ఫేమస్ అవుతున్నారు యంగ్ కంపోజర్ గౌర హరి. ఆయన రీసెంట్ గా హనుమాన్ సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. హనుమాన్ వరల్డ్ వైడ్ సాధించిన విజయంలో సంగీత దర్శకుడిగా గౌర హరి మ్యూజిక్ చాలా కీలకంగా మారింది. ఈరోజు ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా మ్యూజిక్ లవర్స్, ఇండస్ట్రీలోని మిత్రులు గౌర హరికి బర్త్ డే విశెస్ తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు.
ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు గౌర హరి. తేజ సజ్జ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూపొందిస్తున్న మిరాయి మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు గౌర హరి. ఈ సినిమా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు మరో బాలీవుడ్ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు గౌర హరి.