మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా గుంటూరు కారం షూటింగ్ అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కాబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్ లో మహేశ్ బాబు భారీ యాక్షన్ సీక్వెన్సులు చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్ లతో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేయించారు దర్శకుడు త్రివిక్రమ్.
సంక్రాంతికి గుంటూరు కారం సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు. ఇప్పటిదాకా షూటింగ్ ఆగినా…ముందుగా వేస్తున్న షెడ్యూల్స్ కు ఇంకా నెలరోజుల సమయం మిగిలే ఉంటోందని, ఈలోగా తప్పకుండా సినిమాను కంప్లీట్ చేసి ఫస్ట్ కాపీ తెచ్చుకుంటామనే కాన్ఫిడెన్స్ టీమ్ లో కనిపిస్తోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ సంస్థలో దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్నారు. మిర్చీ యార్డ్ నేపథ్యంగా సాగే ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా గుంటూరు కారం సినిమా తెరపైకి రాబోతోంది.