మహేశ్ బాబు కొత్త సినిమా గుంటూరు కారం హైదరాబాద్ లో జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటోంది. నిర్విరామంగా జరుగుతున్న ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇప్పటిదాకా అనేక అవాంతరాలతో షూటింగ్ వాయిదాలు పడుతూ రాగా..ఇక ఇప్పుడు కంటిన్యూగా షెడ్యూల్ చేయాలని టీమ్ నిర్ణయించారట. గుంటూరు కారం చిత్రీకరణ వేగవంతం కావడంతో అటు అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో కీ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీలీలను విలన్స్ కిడ్నాప్ చేయగా..మహేశ్ కాపాడే సన్నివేశాలను రూపొందించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ యాక్షన్ సీన్స్ మాస్ కు ఫీస్ట్ లా ఉండబోతున్నాయట. రెగ్యులర్ షెడ్యూల్స్ లో సినిమాను కంప్లీట్ చేసి వచ్చే సంక్రాంతికి గుంటూరు కారం సినిమాను రిలీజ్ చేస్తామనే కాన్ఫిడెన్స్ లో మూవీ టీమ్ ఉన్నట్లు సమాచారం.
హారికా హాసినీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా..జగపతి బాబు విలన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.