ఫుల్ స్పీడుతో దూసుకెళుతున్న “గుంటూరు కారం”

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ గుంటూరు కారం. ఈ చిత్రంలో మహేష్‌ కు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు బ్రేకులు పడుతూనే ఉంది. అయితే… ఇక నుంచి ఎలాంటి బ్రేకులు పడకుండా ఫాస్ట్ గా షూటింగ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన మహేష్ బాబు షూటింగ్ లో జాయిన్ అయ్యారు. మహేష్ బాబు మరియు ప్రధాన తారాగణం పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఆరు రోజులు పాటు ఇంటర్వెల్ బ్యాంగ్ చిత్రీకరించాలని ప్లాన్ చేశారట. అయితే.. మహేష్‌ ఈ కీలక ఎపిసోడ్ ను మూడు రోజుల్లోనే కంప్లీట్ చేసేశాడట. రేపటి నుంచి సారధి స్టూడియోలో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ రెడీగానే ఉంది కానీ.. మహేష్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉన్న మహేష్ మంచి మూహుర్తం చూసి రిలీజ్ చేద్దామన్నారట. సంక్రాంతికి గుంటూరు కారం చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.