“విశ్వం” టీజర్ ఎలా ఉందంటే ?

శ్రీను వైట్ల(Srinu vaitla) సినిమాల్లో కామెడీ హైలైట్ అవుతుంటుంది. తన సినిమా కథలు ఏ జానర్ లో ఉన్నా కామెడీ మాత్రం కావాల్సినంత ఉంటుంది. గోపీచంద్(Gopichand) కు మాస్ ఇమేజ్ ఉంది. ఈ ఇద్దరూ కలిసి రూపొందించిన విశ్వం సినిమా కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజు విశ్వం(Vishwam) సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

శ్రీను వైట్ల సినిమాల్లో ఉండే కామెడీ, హీరోయిజం ఇందులోనూ కంటిన్యూ అయ్యాయి. ప్రతి సీన్ లోనూ అరడజను మంది కమెడియన్స్ ఉన్నారు. వెంకీ సినిమాలోలా ట్రైన్ కామెడీ పెట్టారు. ఇలాంటి యాక్షన్ సీన్స్ గోపీచంద్ కు అలవాటే. విశ్వం ఒక పక్కా కమర్షియల్ సినిమాలా టీజర్ చూపించింది. ఈ చిత్రంలో కావ్య థాపర్(Kavya thapar) హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రాలయం స్టూడియోస్ నుంచి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People media factory) చేతికి వచ్చాక ఈ సినిమా స్పీడప్ అయ్యింది. అక్టోబర్ 11న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.