యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో సూపర్ హిట్ సినిమాలు చేసిన దర్శకుడు శ్రీను వైట్ల. తనదైన ఫార్ములా కథలతో స్టార్ హీరోలతో సినిమాలు చేశారీ దర్శకుడు. గతంలో శ్రీను వైట్ల చేసిన ఆగడు, మిస్టర్, అమర్ అక్భర్ ఆంటోనీ సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆయన కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. ప్రస్తుతం ఈ దర్శకుడు హీరో గోపీచంద్ తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అటు గోపీచంద్ కూడా పదేళ్లుగా హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఆయన గత చిత్రాలు పంతం, చాణక్య, ఆరడగుల బుల్లెట్, సీటీమార్, పక్కా కమర్షియల్, రామబాణం వంటి చిత్రాలన్నీ అపజయం పాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పోలీస్ కథతో భీమా సినిమా చేస్తున్నారు. శ్రీనువైట్ల శ్రీవిష్ణుతో ఢీ సీక్వెల్ ఢీ 2 అనౌన్స్ చేసినా అది పట్టాలెక్కలేదు. ఇప్పుడు గోపీచంద్ తో ఆయన ఎలాంటి సినిమా చేయబోతున్నారో చూడాలి.