సౌత్ లో స్టార్ హీరోయిన్ గా రెండు దశాబ్దాల కెరీర్ చూసింది తమన్నా. హిందీ నుంచి ఆమె కెరీర్ ప్రారంభమైనా…తెలుగు, తమిళ సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకుంది. ఇక్కడ ఇంతమంది హీరోలతో కలిసి సినిమాలు చేసినా తమన్నా పర్సనల్ లైఫ్ గురించి, లవ్ అఫైర్స్ గురించి రూమర్స్ రాలేదు. ఇన్నేళ్ల తర్వాత తమన్నా లవ్ స్టోరి గురించి వింటున్నాం. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ప్రేమిస్తున్నానంటూ తమన్నా ఆ మధ్య వెల్లడించింది.
తమన్నా, విజయ్ వర్మ ప్రేమ గురించి బయటకు వచ్చినప్పటి నుంచి వీళ్లు ఎక్కడికి వెళ్లినా మీడియా ఫాలో చేస్తోంది. ఇది తనను ఇబ్బంది పెడుతోందని విజయ్ వర్మ అంటున్నాడు. ఆయన స్పందిస్తూ…మేమిద్దరం ప్రేమలో ఉన్నాం అని చెప్పుకునేవరకు మా మీద ఎవరి ఫోకస్ లేదు. కానీ మేము లవర్స్ అని తెలిశాక..కలిసి ఎక్కడికి వెళ్లినా మీడియా వెంటపడుతోంది. ఇంత లైమ్ లైట్ లో తమన్నాతో బయటకు వెళ్లడం ఇబ్బందిగా ఉంది. అని విజయ్ వర్మ చెబుతున్నాడు.
లవ్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ షూటింగ్ టైమ్ లో తమన్నా, విజయ్ వర్మ లవ్ లో పడ్డారు. తనపై చాలా కేరింగ్ గా విజయ్ వర్మ ఉంటాడని, లైఫ్ లో బాగా చూసుకుంటాడనే నమ్మకం ఏర్పడిందని, అందుకే అతన్ని ప్రేమించినట్లు తమన్నా చెప్పుకుంది.