గాండీవధారి అర్జున ట్రైలర్ రివ్యూ – ప్రపంచానికి తెలియాల్సిన ఆ నిజం ఏంటి

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా గాండీవధారి అర్జున ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాను ఎస్వీసీ బ్యానర్ పై దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందిస్తున్నారు. ఈ నెల 25న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాజర్ ఓ కీలక పాత్రను పోషించారు. గాండీవధారి అర్జున ట్రైలర్ ఇవాళ రిలీజైంది. ఆ ట్రైలర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

డిసెంబర్ 2020లో దేవుడిని మనిషి జయించాడట. పాతికవేల సంవత్సరాల తర్వాత మనిషి చేసిన వస్తువులు దేవుడి చేసిన వాటిని మించిపోయాయట. అంటూ కేంద్ర పర్యావరణ మంత్రి పాత్రలో నాజర్ చెప్పిన డైలాగ్స్ తో ట్రైలర్ మొదలైంది. ఇంటర్ పోల్ అధికారి అర్జున్ గా వరుణ్ తేజ్ ను పరిచయం చేశారు. ప్రపంచంలోని అత్యున్నత వ్యక్తులకు భద్రత అందించే ఈ సంస్థలో వరుణ్ కు మంచి పేరుంది. క్లైంట్ ను కాపాడేందుకు అవసరమైతే తన ప్రాణాలు అడ్డు వేయగల సమర్థుడు అర్జున్. అలాంటి అర్జున్ ను కేంద్రమంత్రి ఓ మిషన్ మీద పంపిస్తాడు. ఒక వ్యాపారవేత్త తప్పుకు 12 వేల మందిని బలవుతారు. అతనెవరు. అతన్ని అర్జున్ ఎలా పట్టుకున్నాడు. ప్రపంచానికి తెలియాల్సిన నిజాన్ని ఎలా చెప్పాడు అనేది ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. మొత్తంగా ఒక ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందించినట్లు తెలుస్తోంది.