“గేమ్ ఛేంజర్” ట్రైలర్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ ను రేపు సాయంత్రం 5.04 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10న గేమ్ ఛేంజర్ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది.

పొలిటికల్ డ్రామా కథతో దర్శకుడు శంకర్ రూపొందించారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాజమండ్రిలో నిర్వహించబోతున్నారు. పవన్ కల్యాణ్, చిరంజీవి ఈ ఈవెంట్ లో అతిథులుగా పాల్గొనబోతున్నారు.