“గేమ్ ఛేంజర్” బుకింగ్స్ ఓపెన్

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ఓపెన్ అయ్యాయి. ఇప్పటికే యూకేలో టికెట్స్ అమ్మకం ప్రారంభం కాగా…ఇప్పుడు అమెరికాలోనూ టికెట్స్ అమ్మకాలు మొదలుపెట్టారు. దీంతో ఓవర్సీస్ లో కంప్లీట్ గా అడ్వాన్స్ బుకింగ్స్ తెరిచినట్లయింది. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్ సేల్స్ తోనే రికార్డులు సృష్టిస్తున్నాయి. మిలియన్ల కొద్దీ డాలర్స్ వసూళ్లు ఈ ప్రీ సేల్స్ తోనే జరుగుతున్నాయి.

గేమ్ ఛేంజర్ కూడా అలాంటి రికార్డ్ మీద కన్నేసిందని అనుకోవచ్చు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా భారీ పొలిటికల్ డ్రామాగా తెరపైకి రాబోతోంది. వచ్చే నెల 10న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.