రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు శంకర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రానున్న గేమ్ ఛేంజర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తాజాగా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో కీ సీన్స్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాల్లో ముఖ్యమైన కాస్ట్ అంతా పాల్గొన్నారట.
ఇక తదుపరి షెడ్యూల్ కోసం గేమ్ ఛేంజర్ సన్నాహాలు చేసుకుంటోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ కొత్త షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తో మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడు శంకర్ భావిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా మేకింగ్ పరంగా ఆలస్యమవుతూ వస్తోంది. పర్ ఫెక్షన్ కోసం దర్శకుడు శంకర్ చేస్తున్న ప్రయత్నాలే సినిమా షూట్ లేట్ అవడానికి కారణంగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో గేమ్ ఛేంజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.