ఔట్ డేటెడ్ హీరో, సీనియారిటీ మీద పడుతున్న హీరోయిన్…వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఓ సీక్వెల్ మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్టు 11న రిలీజైన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ చరిత్ర సృష్టిస్తోంది గదర్ 2 సినిమా.
బాలీవుడ్ లో మూడో అతి పెద్ద బాక్సాఫీస్ సక్సెస్ గా నిలిచిన ఈ సినిమా త్వరలోనే సెకండ్ ప్లేస్ కు…ఫుల్ రన్ కంప్లీట్ చేసేలోగా హయ్యెస్ట్ గ్రాస్డ్ బాలీవుడ్ మూవీగా నిలిచే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం గదర్ 2 కలెక్షన్స్ 482 కోట్ల రూపాయలకు చేరాయి.
అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్నీ డియోల్ హీరోగా నటించగా…అమీషా పటేల్ హీరోయిన్ గా కనిపించింది. 1971 ఇండియా పాకిస్థాన్ వార్ సందర్భంగా పాక్ లో చిక్కుకున్న తన కొడుకును ఇండియా తీసుకొచ్చేందుకు తండ్రి చేసిన సాహసమే ఈ సినిమా నేపథ్యం. ఇందులోని ఎమోషన్, యాక్షన్ అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.