“డ్రాగన్” షూట్ కోసం మంగళూరుకు ఎన్టీఆర్

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తను చేస్తున్న కొత్త మూవీ షూటింగ్ కోసం ఎన్టీఆర్ మంగళూరు వెళ్లారు. రేపటి నుంచి ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ కాబోతున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో మూవీకి డ్రాగన్ అనే పేరు ప్రచారంలో ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం కాగా..ఇప్పుడు మంగళూరులో ఎన్టీఆర్ పాల్గొనే షెడ్యూల్ బిగిన్ చేయనున్నారు. ఎన్టీఆర్ కర్ణాటక వెళ్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20 డ్రాగన్ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.